బాధితులెవరైనా సమాన గౌరవం
- జిల్లా పోలీస్ కార్యాలయంలో స్వీపర్, స్కావెంజర్ దంపతులకు ఎస్పీ భరోసా
విశ్వంభర, సూర్యాపేట: జిల్లా పోలీస్ కార్యాలయానికి వచ్చే ప్రతి బాధిత ఫిర్యాదుదారుడికి చట్టం ముందు సమాన గౌరవం, మర్యాద దక్కుతుందని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ మరోసారి నిరూపించారు. తన కార్యాలయంలోనే తాత్కాలిక ప్రాతిపదికన రోజువారీ కూలీలుగా పనిచేస్తున్న స్వీపర్, స్కావెంజర్ దంపతులు ఈరోజు బాధితులుగా ప్రజావాణికి రాగా, వారికి అంతే గౌరవం ఇచ్చి సమస్యను అడిగి తెలుసుకున్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో షకీరా బేగం, షేక్ షఫీ దంపతులు ఇద్దరూ స్వీపర్, స్కావెంజర్ గా తాత్కాలిక ప్రాతిపదికన రోజు కూలీగా విధులు నిర్వహిస్తున్నారు. సూర్యాపేట పట్టణంలో ఒక ప్లాట్ కొనుగోలు విషయంలో తీవ్రంగా మోసపోయామని, లేని ప్లాట్ ను ఉన్నట్లు చూపించి డబ్బులు తీసుకున్నారు అని, మోసపోయాము న్యాయం చేయాలంటూ జిల్లా పోలీస్ ప్రజావాణిలో ఎస్పీ నరసింహ కి ఈరోజు ఫిర్యాదు చేశారు. సాధారణంగా ఎస్పీ కార్యాలయానికి వచ్చే బాధితులను ఎస్పీ నరసింహ ఎంతో మర్యాదగా తన ముందు కూర్చోబెట్టుకుని, వారి సమస్యలను ఓపిగ్గా వింటారు. ఇదే క్రమంలో తన కార్యాలయంలో పనిచేసే సిబ్బంది బాధితులుగా వచ్చిన వేళ, వారికి కూడా అదే గౌరవాన్ని ఇస్తూ ఎదురుగా కూర్చోబెట్టి వారి బాధను విన్నారు. వారికి పూర్తి ధైర్యాన్ని, భరోసాని ఇస్తూ ఈ మోసంపై తక్షణమే విచారణ జరిపి బాధితులకు భరోసా కల్పించాలని సంబంధిత అధికారులను ఎస్పీ ఆదేశించారు. అండగా నిలిచిన ఎస్పీ స్పందన పట్ల బాధితులు సంతోషం వ్యక్తం చేశారు.