నెల్లికుదురు  పిఎసిఎస్ చైర్మన్ లను

నెల్లికుదురు  పిఎసిఎస్ చైర్మన్ లను

  •  ఎస్సీ, ఎస్టీలకు కేటాయించాలి

విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని నెల్లికుదురు, శ్రీరామగిరి, ఎర్రబెల్లి గూడెం లకు చెందిన మూడు ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాల చైర్మన్ పదవులను ఎస్సీ ఎస్టీలకు కేటాయించాలని షెడ్యూల్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ సీనియర్ నేత దండెంపల్లి సైదులు డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పిఎసిఎస్ లు ఏర్పడిన నాటి నుంచి జనరల్ కేటగిరీ లే కొనసాగుతూ అగ్రవర్ణాల వారు పదవులు పొందుతున్నారన్నారు.ఎస్సీ ఎస్టీలకు కేటాయించకపోవడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు.నెల్లికుదురు మండలంలో ఎస్సీలు అధికంగా ఉన్నారని నెల్లికుదురు పిఎసిఎస్ ను ఎస్సీలకే కేటాయించాలన్నారు. మొదటి నుంచి ఎస్సీలు కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకు గా ఉన్నారని పిఎసిఎస్ చైర్మన్ పదవులలో ఎస్సీలను విస్మరించవద్దని కోరారు. కేవలం ఎన్నికల సమయంలో ఉపయోగించుకొని అనంతరం పట్టించుకోకుండా ఉండకూడదు అన్నారు.ఎస్సీలకు కేటాయించని పక్షంలో ప్రజాసంఘాలతో కలిసి భారీ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.

🕒 10 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/nellikuduru-pacs-chairman/article-18428

Tags: