వెల్లంకిలో పేకాట స్థావరంపై పోలీసుల దాడి.. నలుగురు అరెస్ట్

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలో పేకాట ఆడుతున్న నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,800 నగదుతో పాటు రెండు సెట్ల పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. రామన్నపేట ఎస్సై జి. సతీష్ తెలిపిన వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో వెల్లంకి గ్రామంలో పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఎస్సై ఆదేశాల మేరకు ఎం. వెంకటేశ్వర్లు, సిబ్బంది నరసింహ, రాఘవేందర్, కృష్ణమూర్తి కలిసి గ్రామంలో దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌కే జానీ మియా ఇంటి ముందు పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులు పోలీసులను గమనించి పరారయ్యేందుకు ప్రయత్నించగా, పోలీసులు వెంటాడి వారిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అయిన వారు వెల్లంకి గ్రామానికి చెందిన గోదుమల సంగప్ప (తండ్రి పర్వతాలు), కోయ్యలకారి రాజు (తండ్రి నర్సోజి), కోయ్యలకారి రాము (తండ్రి నర్సోజి), ఎస్‌కే జానీ మియా (తండ్రి గాలిబ్ సహాబ్)గా పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి రూ.1,800 నగదు, రెండు సెట్ల పేకముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై జి. సతీష్ తెలిపారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.

🕒 10 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/four-arrested-in-police-raid-on-poker-base-in-vellanki/article-18443

Tags: