గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

గీత కార్మికుల సమస్యలను పరిష్కరించాలి

  • ఈనెల 12న హుస్నాబాద్ లో గౌడ హక్కుల సాధన సభ
  • గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర శ్రీనివాస్ గౌడ్

విశ్వంభర, హుస్నాబాద్:  కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను,గీత కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని గీత కార్మికులకు పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 50 సంవత్సరాలు దాటిన ప్రతి గీత కార్మికునికి పెన్షన్ విధానంతో పాటు ఐడి కార్డు ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేయాలని గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు బుర్ర శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురువారం హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని అక్కన్నపేట మండలం కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ,  గౌడ జన హక్కుల పోరాట సమితి మోకు దెబ్బ ఆధ్వర్యంలో ఈనెల 12న ఆదివారం చలో హుస్నాబాద్  కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి గీత కార్మికుల హక్కుల సాధనకు ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు . హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి గీత కార్మికులు  ఈ సభలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు శ్యామ్ సుందర్ గౌడ్,గౌడ సంఘ నాయకులు తాళ్లపల్లి మల్లేశం గౌడ్ జాగిడి మల్లేశం బత్తిని రాజు కోయాడ రాజు బత్తిని శ్రీనివాస్ మందసదయ్య తదితరులు పాల్గొన్నారు.

🕒 10 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-problems-of-geetha-workers-should-be-solved/article-18416

Tags: