శంకర్‌పల్లి నుంచి కాచిగూడ వరకు రైల్వే స్టేషన్ల తనిఖీ చేసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్
విశ్వంభర, జీహెచ్‌ఎంసీ: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ గురువారం శంకర్‌పల్లి, నాగలపల్లి, హైటెక్ సిటీ, కాచిగూడ రైల్వే స్టేషన్లను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే సికింద్రాబాద్–శంకర్‌పల్లి సెక్షన్‌లో రియర్ విండో ఇన్‌స్పెక్షన్ నిర్వహించి ట్రాక్, సిగ్నలింగ్ వ్యవస్థ, సెక్షనల్ వేగాలు తదితర అంశాలను సమీక్షించారు. ఈ తనిఖీ సందర్భంగా సికింద్రాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ డాక్టర్ ఆర్. గోపాలకృష్ణన్‌తో పాటు ప్రధాన కార్యాలయం, డివిజన్‌కు చెందిన పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. సికింద్రాబాద్–శంకర్‌పల్లి సెక్షన్‌లో రియర్ విండో తనిఖీ చేపట్టిన జనరల్ మేనేజర్, నాగలపల్లి–శంకర్‌పల్లి స్టేషన్ల మధ్య ఉన్న చిన్న వంతెనను పరిశీలించారు. అనంతరం శంకర్‌పల్లి రైల్వే స్టేషన్‌లో ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సౌకర్యాలు, మౌలిక వసతులు, అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించి అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. తదుపరి నాగలపల్లి రైల్వే స్టేషన్‌ను సందర్శించిన ఆయన, ప్రయాణికుల సౌకర్యాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, సర్క్యులేటింగ్ ఏరియా, స్టేషన్ భవనం, కొత్తగా నిర్మించిన ర్యాంప్, సమీప లెవల్ క్రాసింగ్ గేట్‌ను పరిశీలించారు. అనంతరం అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద రూ.26 కోట్ల వ్యయంతో పునరాభివృద్ధి జరుగుతున్న హైటెక్ సిటీ రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్‌లో నిర్మిస్తున్న ఆధునిక ప్రయాణికుల సౌకర్యాలు, వెడల్పైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ప్లాట్‌ఫారాలు, సర్క్యులేటింగ్ ఏరియాతో పాటు స్టేషన్ మాస్టర్ గది, సిగ్నలింగ్ వ్యవస్థ, భద్రతా పరికరాలను పరిశీలించి పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. తనిఖీ కార్యక్రమం చివరిగా కాచిగూడ రైల్వే స్టేషన్‌లో కొనసాగింది. ఈ సందర్భంగా హైదరాబాద్ డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ సంతోష్ కుమార్ వర్మతో పాటు పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్లాట్‌ఫారం నంబర్–1లో ప్రయాణికుల సౌకర్యాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిని పరిశీలించిన జనరల్ మేనేజర్, గోల్నాక వైపు ఉన్న రెండో ప్రవేశ ద్వారం ప్రాంతాన్ని కూడా తనిఖీ చేశారు. స్టేషన్ ఆధునీకరణ ప్రణాళికలు, ప్రయాణికుల సౌకర్యాల విస్తరణపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు.