ఎర్రబెల్లిగూడెం పిఎసిఎస్ చైర్మన్ పదవిని బీసీలకు కేటాయించాలి
- ఓ బి సి కాంగ్రెస్ నేత మరద హరికృష్ణ
విశ్వంభర, నెల్లికుదురు: మండలంలోని ఎర్రబెల్లి గూడెం పి ఎస్ సి ఎస్ చైర్మన్ పదవిని బీసీలకు కేటాయించాలని కాంగ్రెస్ ఓబిసి నాయకులు మరద హరికృష్ణ డిమాండ్ చేశారు.ఈ మేరకు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎర్రబెల్లి గూడెం ప్రాథమిక సహకార సంఘం ఏర్పడిన నాటి నుంచి ఎక్కువసార్లు జనరల్ కేటగిరి కొనసాగుతూ అగ్రవర్ణాల వారే అనేక టర్ములు పదవులలో కొనసాగారని, ఈసారి బీసీలకు అవకాశం కల్పించాలన్నారు. రాష్ట్రంలో సైతం పిఎసిఎస్ లలో బీసీల దామాషా ప్రకారం చైర్మన్ పదవులతో పాటు డైరెక్టర్ల పదవులకు బీసీలను నియమిస్తూ సముచిత స్థానం కల్పించాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్న దృష్ట్యా పదవులను సైతం వెనుకబడిన తరగతుల జనాభా మేరకు అన్ని రంగాలలో అవకాశాలు కల్పించాలని కోరారు.