సర్పంచి హరిచంద్ కు హుస్సేన్ నాయక్ పరామర్శ

విశ్వంభర, ఇనుగుర్తి: మండలం లోని చీన్య తండా సర్పంచి జాటోతో హరిచంద్ నాయక్, తో పాటు ఆయన సోదరులను కుటుంబ సభ్యులను జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ పరామర్శించారు. హరిచంద్ నాయక్ తల్లి శతాధిక వృద్ధురాలు దేవ్లి ఇటీవల కన్ను మూసింది. సమాచారం తెలుసుకున్న హుస్సేన్ నాయక్ శుక్రవారం వారి ఇంటికి వచ్చి దేవ్లి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రస్తుత యాంత్రిక జీవన శైలిలో సైతం 105 సంవత్సరాలు మీ మాతృమూర్తి ఆరోగ్యంగా జీవించడం మీరు ఆమె పట్ల అందించిన ప్రేమ,ఆప్యాయత, అనురాగం,సేవ వలననే సాధ్యమైందని సర్పంచి తోపాటు కుటుంబ సభ్యులను అభినందించారు.పెద్దదిక్కును కోల్పోవడం విచారకరమని,ఆపద సమయంలోను ధైర్యాన్ని కోల్పోవద్దని ధైర్య వచనాలు చెప్పారు. హుస్సేన్ నాయక్ వెంట బిజెపి జిల్లా అధ్యక్షులు వల్లబు వెంకటేశ్వర్లు,డా.పోలేపల్లి వెంకటేశ్వర్లు నాయకులు కార్యకర్తలు ఉన్నారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/hussain-naiks-advice-to-sarpanchi-harichand/article-15186

Tags: