అంతర్జాతీయ తలసీమియా దినోత్సవం సందర్భంగా
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ర్యాలీ
విశ్వంభర, మహాబాబాబాద్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాలతో అంతర్జాతీయ తలసీమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం మహబూబాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి నుండి నెహ్రూ సెంటర్ వరకు భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సివిల్ సర్జన్ – ఆర్‌ఎంఓ డా. జగదీశ్వర్ , ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. సుధీర్ రెడ్డి సంయుక్తంగా జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తలసీమియా ఒక వంశపారంపర్య రక్త సంబంధిత వ్యాధి అని, రక్తం లో హీమోగ్లోబిన్ సరైన విధంగా తయారవదు అందువల్ల రక్తహీనత వస్తుంది ముందస్తు పరీక్షలు, ప్రజల్లో అవగాహన ద్వారా ఈ వ్యాధిని నివారించవచ్చని తెలిపారు. యువత వివాహానికి ముందు రక్త పరీక్షలు చేయించుకోవడం ద్వారా తలసీమియా బారిన పడే పిల్లల జననాన్ని తగ్గించవచ్చని సూచించారు. ర్యాలీ సందర్భంగా ప్రజలకు తలసీమియా వ్యాధి లక్షణాలు, నివారణ చర్యలు, రక్తదాన ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. అనంతరం సికిల్ సెల్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ 2025 సెప్టెంబర్ నుండి ఈ రోజు వరకు 4050 గర్భిణీ స్త్రీలకు తలసీమియా హెచ్‌పిఎల్‌సి పరీక్ష నిర్వహించగా అందులో 114 మందికి మైనర్ తలసేమియా గా ఒకరికి మేజర్ తలసేమియగా నిర్ధారించడం జరిగింది. అనంతరం వారి ఆద్వర్యంలో మహబూబాబాద్ లోని బ్లడ్ బ్యాంక్ లో రక్త దానం చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తలసీమియా ప్రోగ్రాం అధికారి డా. శ్రవణ్ కుమార్, డా. లక్ష్మీనారాయణ, డా. విరాజిత, డా. అనిత, జిల్లా డిప్యూటీ మాస్ మీడియా అధికారి కొప్పు ప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ ఎ. పురుషోత్తం, ఎంపిహెచ్‌ఈఓలు కె.ఎల్.ఎన్. స్వామి, తోట శ్రీనివాస్, లోక్య, ఎంఎల్‌హెచ్‌పి నిఖిల్, విగ్నెష్, మహబూబాబాద్ పట్టణ ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్లు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.