మోడీ ద్వారానే చట్టసభలలో రిజర్వేషన్ సాధ్యం : రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య 

విశ్వంభర, హైదరాబాదు : జనగణనలో కులగణన చేపట్టడం ద్వారా బీసీలకు జనాభా ప్రాతిపదికన హక్కులు సాధ్యమవుతాయని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాదు కాచిగూడలో జరిగిన  బీసీ సంఘాల సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ సమావేశానికి బీసీ సంఘం నేతలు నీల వెంకటేష్, రాజేందర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం జనగణనలో కులగణన చేపడతామని ప్రకటించిందని, దీనిపై ఎటువంటి సందేహాలు అవసరం లేదన్నారు. కులగణన పూర్తయితే బీసీలకు జనాభా ప్రాతిపదికన విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ, సామాజిక రంగాల్లో సముచిత వాటా లభిస్తుందని చెప్పారు. కేంద్రం కులగణనను అంగీకరించడం చారిత్రాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. స్వాతంత్ర్యం తర్వాత దశాబ్దాల పాటు ఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోలేదని, ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో అది సాధ్యమైందన్నారు. పార్లమెంట్‌లో బీసీ బిల్లు ప్రవేశపెట్టి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో బీసీల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి రూ.2 లక్షల కోట్లతో అభివృద్ధి పథకాన్ని ప్రకటించాలని కోరారు. అలాగే విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని, క్రిమిలేయర్ విధానాన్ని తొలగించాలని అన్నారు. పారిశ్రామిక విధానంలో బీసీలకు 50 శాతం కోటా కేటాయించాలని సూచించారు. కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు పర్ల గొర్ల మోడీ రాందేవ్, నిఖిల్ పటేల్, అశోక్, బలరాం, మల్లేష్ యాదవ్, రాము తదితరులు పాల్గొన్నారు.

🕒 09 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rajya-sabha-member-r-krishnaiah-made-reservation-in-legislatures-possible/article-15159

Tags: