గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి
On
విశ్వంభర, గుండాల: మండలంలో ఉన్న రైతులందరు తమ పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించుకొని సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పశువుల ఆరోగ్యాన్నీ పరిరక్షించుకోవాలని పశువైద్యాధికారి డాక్టర్ యాకుబ్ అన్నారు. ,గుండాల మండలంలో అనంతారం గ్రామాల్లో పశుసంవర్ధకశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టీకాలు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సుమారు 136 పశువులకు టీకాలు వేయడం జరిగింది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామా సర్పంచ్ పెండ్యాల వినోద్, పాల సెంటర్ చైర్మన్ ఎం డి అక్బర్, డైరెక్టర్ ఇట్టబోయిన నాగరాజు, వి ఏ రాజ , గోపాలమిత్రలు గోవింద్, కృష్ణ, నరేష్, శ్రీను, శేఖర్, రైతులు పాల్గొన్నారు.



