ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో  కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

విశ్వంభర, హైదరాబాదు : సీఎం రేవంత్​ రెడ్డికి పాలనపై అవగాహనే లేదని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్​ రెడ్డి అన్నారు.  ఉదయం లేవగానే రాహుల్​ ఫోన్​ కోసం వేచి చూస్తూ ఢిల్లీ వెళ్లాలా లేదా? అనే ఆలోచిస్తారే తప్ప రాష్ట్రంలో  ప్రజా సమస్యల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోరని ఆరోపించారు. మిగులు బడ్జెట్​ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్​ఎస్​, కాంగ్రెస్​ లు కలిసి అప్పుల ఊబిలోకి తోశాయన్నారు. ఇచ్చిన గ్యారంటీలు, హామీల అమలు దేవుడెరుగు ఉన్న ఉద్యోగులకు, అవసరాలకే రాష్​ర్టంలో నిధులు లేవని ఆరోపించారు. తెలంగాణను బంగారు మయం చేస్తానని కుటుంబాన్ని కేసీఆర్​ బంగారు మయం చేసుకున్నారని విమర్శించారు. రాష్ట్రంలో  రియల్​ రంగం పూర్తిగా కుదేలయ్యిందన్నారు. కుప్పకూలే పరిస్థితిలో ఉందని మండిపడ్డారు. ఇలా అన్ని రంగాలను సీఎం రేవంత్​ రెడ్డి ప్రభుత్వం నిర్వీర్యం చేసిందన్నారు. ఇచ్చిన గ్యారంటీలు, హామీలను నెరవేర్చకుండా తనతో చర్చకు వస్తాననడం ఆయన చేతకానితనానికి నిదర్శనమన్నారు. గ్యారంటీలు, హామీలను నెరవేర్చి తనతో చర్చకు రావాలని కేంద్రమంత్రి కిషన్​ రెడ్డి సవాల్​ విసిరారు.

Tags: