జిహెచ్ఎంసి నిధులతో సీసీ రోడ్డు పనులు ప్రారంభం
విశ్వంభర, ఛత్రినాక: పాతబస్తీ చంద్రాయణ గుట్ట నియోజకవర్గంలోని ఛత్రినాక నుండి కందికల్ గేట్ బోయగూడా వరకు రూ.32 లక్షల జిహెచ్ఎంసి నిధులతో చేపట్టిన సిసి రోడ్డు పనులను కాంగ్రెస్ పార్టీ మాజీ ఉపాధ్యక్షుడు రాజు యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజు యాదవ్ మాట్లాడుతూ గత కొద్ది రోజుల నుంచి గుంతల మయంగా మారిన రోడ్డుతో వాహనదారులు, పాదాచారులు ఇబ్బంది గురవుతున్నారని జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి దృష్టికి తీసుకోవడంతో ప్రజల సమస్యలపై వెంటనే స్పందించి నిధులు మంజూరు చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్ ఛార్జ్ పొన్నం ప్రభాకర్, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు పాతబస్తీ అభివృద్ధి కి ఎంతో కృషి చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.