హనుమకొండ జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షుడిగా చల్లా రాకేష్ రెడ్డి
విశ్వంభర, హనుమకొండ: హనుమకొండ జిల్లా భీమారం సమీపంలోని జగతి కన్వెన్షన్ హాల్‌లో హనుమకొండ జిల్లా సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో సర్పంచుల చైతన్య సదస్సు గురువారం ఘనంగా నిర్వహించారు. హనుమకొండ జిల్లాలోని అన్ని మండలాల నుంచి సర్పంచులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా తెలంగాణ పంచాయతీరాజ్ రాష్ట్ర చాంబర్ అధ్యక్షులు చింపుల సత్యనారాయణ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన సర్పంచుల సమస్యలు, గ్రామాభివృద్ధి, స్థానిక సంస్థల బలోపేతంపై కీలక ప్రసంగం చేశారు. అలాగే రాష్ట్ర చాంబర్ సెక్రటరీ సిద్దార్థ,అశోక్ రావు,జిల్లాల నాయకులు శివారెడ్డి, శ్రీధర్ గౌడ్,వెంకట్ రాములు, ప్రత్యేక అతిథులుగా పాల్గొని సర్పంచులకు తమ పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా హనుమకొండ జిల్లా సర్పంచుల తీర్మానం మేరకు చల్లా రాకేష్ రెడ్డిని హనుమకొండ జిల్లా సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం ముఖ్య అతిథులు చల్లా రాకేష్ రెడ్డిని శాలువాలతో, పూల దండలతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడు చల్లా రాకేష్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలోని ప్రతి సర్పంచ్‌కు అండగా నిలుస్తూ గ్రామపంచాయతీల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి, సర్పంచుల హక్కుల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలోని అన్ని సర్పంచులను ఏకతాటిపైకి తీసుకువచ్చి గ్రామాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన సర్పంచులు, సర్పంచుల సంఘం నాయకులు ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.