రాయితీపై పత్తి, కంది విత్తనాల పంపిణీ
- సబ్సిడీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలి
- మండల వ్యవసాయ అధికారి వేల్పుల పూజ
విశ్వంభర, హుస్నాబాద్: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా హుస్నాబాద్ మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో హుస్నాబాద్ రైతు వేదికలో రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై కంది, పత్తి విత్తనాలను పంపిణీ చేసింది. మండల వ్యవసాయ అధికారి వేల్పుల పూజ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి వేల్పుల పూజ మాట్లాడుతూ హుస్నాబాద్ మండల రైతులకు రాయితీపై కంది, పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కంది విత్తనాల కిలో ధర రూ.130 కాగా, ప్రభుత్వ సబ్సిడీతో రైతులు కేవలం రూ.100 మాత్రమే చెల్లించి పొందవచ్చని పేర్కొన్నారు. అధిక సాంద్రత విధానంలో పత్తి సాగుకు అనువైన నూజివీడు సీడ్స్‌కు చెందిన 'అర్మిత' రకం విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అధిక సాంద్రత పద్ధతిలో పత్తి సాగు చేయాలంటే ఎకరాకు ఆరు ప్యాకెట్ల విత్తనాలు అవసరమవుతాయని వివరించారు. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విత్తనాలను వినియోగించడం ద్వారా అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంటుందని రైతులకు సూచించారు. సబ్సిడీ విత్తనాలు కావాలనుకునే రైతులు తమ పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు జిరాక్స్ ప్రతులతో సంబంధిత క్లస్టర్ పరిధిలోని వ్యవసాయ విస్తరణ అధికారులను (ఏఈవోలు) సంప్రదించాలని సూచించారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకుని శాస్త్రీయ పద్ధతుల్లో సాగు చేపట్టాలని కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్‌పర్సన్ చిత్తారి పద్మ, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెన్న రాజు మాట్లాడుతూ రైతుల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని అన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం ద్వారా సాగు వ్యయాన్ని తగ్గించి మెరుగైన దిగుబడులు సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారులు అందించే సాంకేతిక సూచనలను పాటించి పంటల సాగులో విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు జి. వెంకటశివరాం, కె. విజయ్, రైతులు గుర్రాల సంజీవరెడ్డి, గంగం సుధాకర్ రెడ్డి, ఓరుగంటి సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.