కొండోజు శేఖర్ కుటుంబానికి అండగా ఉంటాం .  -తెలంగాణ విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు అసోసియేషన్ . 

విశ్వంభర,హైదరాబాద్ : ఇటీవల కిడ్నీలో రాయి సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాద్‌  పట్టణం లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు కొండోజు శేఖర్ను తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు అసోసియేషన్ నాయకులు శనివారం పరామర్శించారు . ఈ సందర్భంగా సంఘo రాష్ట్ర అధ్యక్షుడు తూములూరి సత్యనారాయణ చారి మాట్లాడుతూ ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని ధైర్యం చెప్పారు . మరియు  కొండోజు శేఖర్ త్వరగా పూర్తి స్థాయిలో కోలుకుని తిరిగి తన వృత్తి బాధ్యతలను నిర్వహించాలని ,  ఆకాంక్షించారు . విశ్వబ్రాహ్మణ జర్నలిస్టుల సంక్షేమమే సంఘం ప్రధాన లక్ష్యమని, సభ్యులకు ఏ ఆపద వచ్చినా తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ జర్నలిస్టు అసోసియేషన్ అండగా నిలుస్తుందని ,  సంఘం  నాయకులు స్పష్టం చేశారు .  శేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.  సంఘ సభ్యుల ఆరోగ్యం, సంక్షేమం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని తెలిపారు.కొండోజు శేఖర్ ఆరోగ్యం త్వరగా మెరుగుపడాలని   ఆయన అన్నారు . ఈ పరామర్శ కార్యక్రమంలో సంఘానికి చెందిన పలువురు రాష్ట్ర ,  జిల్లా  , నాయకులు పాల్గొన్నారు .

🕒 13 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/we-stand-by-the-family-of-kondoju-shekhar-telangana/article-16608

Tags: