అమరవీరులకు నివాళులు అర్పించిన హుస్నాబాద్ బిజెపి నాయకులు
విశ్వంభర, హుస్నాబాద్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పోతారం (ఎస్)లో బిజెపి హుస్నాబాద్ మండల అధ్యక్షుడు భూక్య సంపత్ నాయక్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడి అమరులైన వీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రగతికి ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అలాగే ప్రజలకు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు బొమ్మగాని సతీష్, మాజీ ఎంపీటీసీలు బాణాల జయలక్ష్మి, కుంట మల్లయ్య, నాయకులు వంగ శ్రీనివాస్ రెడ్డి, బైరి అరుణ్, బూతగడ్డపు బాలరాజు, రత్నాకర్ రెడ్డి, వెంకటేష్, కిషన్, బొమ్మగాని ఈశ్వర్, కొలిపాక కిరణ్, గుగులోతు రాములు, మట్టెల రంజిత్ కుమార్, సున్నపు రమేష్, పరశురాములు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.