టీజీపీఎస్సీ ఫీజుల పెంపు తగ్గించాలని డివైఎఫ్ఐ డిమాండ్
విశ్వంభర, హైదరాబాదు : ఉద్యోగ దరఖాస్తుల ప్రాసెసింగ్ ఫీజును వెంటనే తగ్గించాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్, రాష్ట్ర కార్యదర్శి ఆనగంటి వెంకటేష్, నగర కార్యదర్శి ఎం డి జావీద్ ప్రభుత్వాన్ని ప్రకటన ద్వారా డిమాండ్ చేశారు. టీజీపీఎస్సీ దరఖాస్తు ఫీజును రూ.200 నుంచి రూ.1000కు పెంచడంతో నిరుద్యోగ యువతపై తీవ్ర భారం పడుతోందన్నారు. విడివిడిగా నోటిఫికేషన్లు ఇవ్వడంతో ప్రతి దరఖాస్తుకు ఫీజు చెల్లించాల్సి వస్తోందని తెలిపారు. ఈ నేపథ్యంలో పెంచిన ఫీజులను తక్షణమే తగ్గించి నిరుద్యోగులకు ఉపశమనం కల్పించాలని కోరారు.