ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.
- జెండా ఆవిష్కరణలో ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి.తెలంగాణ ఉద్యమకారుడు కొసనం వెంకట్ రెడ్డి, కొసనం ధనలక్ష్మి వెంకటరెడ్డి,
విశ్వంభర, ఎల్బీనగర్:- నియోజకవర్గ పరిధిలోని లెక్చరర్స్ కాలనీ డివిజన్ వీరన్నగుట్టలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుడు కొసనం వెంకట్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కొసనం వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఆనాటి ఉద్యమంలో ఎంతో చురుకుగా పోరాటాలు చేసి తెలంగాణను సాధించుకుని కెసిఆర్ ని ముఖ్యమంత్రి గా గెలిపించుకున్నామో అదేవిధంగా రానున్న ఎన్నికల్లో మళ్లీ కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయడమే లక్ష్యంగా పెట్టుకొని అందరం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారులు, అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వీరన్నగుట్ట మాజీ అధ్యక్షులు కేకేఎల్ గౌడ్, జక్కి రఘువీర్ రెడ్డి, మహిళా అధ్యక్షురాలు కొసనం ధనలక్ష్మి వెంకటరెడ్డి, పరమేష్ గౌడ్, నాగరాజు, జగదీష్ యాదవ్, రాంచంద్రారెడ్డి, చంద్రారెడ్డి, పుణ్యారెడ్డి, అనిల్ కుమార్, నాగార్జున్ రెడ్డి, బాలు, నరసింహ, వసంత లహరి, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సాధనలో అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు కట్టుబడి పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమం అనంతరం పాల్గొన్న వారందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.