ధన్వంతరి కేసు  దర్యాప్తును వేగవంతం చేయాలి

  • విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్టు కన్వీనర్ గిరి ప్రసాద్ శర్మ 

విశ్వంభర, బషీర్ బాగ్: ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ కు సంబంధించిన వందల కోట్ల రూపాయల డిపాజిట్ మోసం కేసులో ఇటీవల చోటుచేసుకొన్న పరిణామాల పట్ల విక్టిమ్స్ రైట్స్ ప్రొటెక్షన్ ట్రస్టు స్పందించింది. వేలాది మంది పెట్టుబడిదారులను ప్రభావితం చేసిన ఈ కేసులో న్యాయం సాధన దిశగా ఒక ముందడుగు వేసినట్టు ట్రస్టు కన్వీనర్ గిరి ప్రసాద్ శర్మ తెలిపారు. బుధవారం హైదరాబాద్ బషీర్ బాగ్ లో ఆయన మాట్లాడారు. ధన్వంతరి ఫౌండేషన్ బాధితుల ప్రయోజనాల పరిరక్షణకు, దర్యాప్తును వేగవంతం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకొంటామని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సిసిఎస్) ప్రకటించడం విశేష పరిణామమన్నారు. మరోవైపు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలై అధికారికంగా నంబర్ పొందిందని పేర్కొన్నారు. రిటపిటిషన్లో ప్రస్తావించిన అనేక అంశాలు సిసిఎన్ మీడియా సమావేశంలో చర్చకు రావడం గమనార్హమన్నారు. బెంగళూరు చాముండి అగ్రహారం పేరుతో సేకరించిన నిధుల వ్యవహారంపై ట్రస్టు దృష్టిసారించినట్టు తెలిపారు. ఈ వ్యవహారంలో డిపాజిటర్ల హక్కుల పరిరక్షణ, అసలు మొత్తం తిరిగి చెల్లింపు, చట్టబద్ధమైన వడ్డీ చెల్లింపు న్యాయస్థానాలు ప్రత్యేక దృష్టిసారించినట్టు వెల్లడించారు. ఇప్పటికే జప్తు చేయబడిన, అటాచ్ చేయబడిన ధన్వంతరి ఆస్తులను ప్రభుత్వ పర్యవేక్షణలో పారదర్శకంగా వేలం వేసి, వచ్చిన మొత్తాన్ని చట్ట ప్రకారం బాధితులకు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన కోరారు. సిసిఎస్ అధికారులు 'ధన్వంతరి' కుట్రలో పాల్గొన్న ప్రతి వ్యక్తిని చట్టం ముందు నిలబెట్టడం, దర్యాప్తును త్వరితగతిన చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ట్రస్టు సంపూర్ణ సహకారం, పోరాటాన్ని కొనసాగిస్తుందని తెలిపారు. ధన్వంతరి ఆస్తుల రికవరీ, బాధ్యులపై చట్టపరమైన చర్యలే తమ లక్ష్యమని స్పష్టంచేశారు. బాధితులందరూ ఐక్యంగా సహనంతో, అప్రమత్తంగా ఉండాలని గిరిప్రసాద్ శర్మ పేర్కొన్నారు. సమావేశంలో కో-కన్వీనర్ మామిళ్లపల్లి విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

🕒 11 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/investigation-of-dhanwantari-case-should-be-expedited/article-16510

Tags: