మంబాపూర్ గ్రామ సమస్యలను పరిష్కరించాలి

మంబాపూర్ గ్రామ సమస్యలను పరిష్కరించాలి

  • అదనపు కలెక్టర్, అటవీ శాఖ అధికారులకు గ్రామస్తుల వినతి

విశ్వంభర, సంగారెడ్డి: మండల పరిధిలోని మంబాపూర్ గ్రామంలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపు, పల్లె ప్రకృతి వనం భూముల పరిరక్షణ, గ్రామానికి సెల్ టవర్ ఏర్పాటు వంటి పలు కీలక డిమాండ్లపై గ్రామ ప్రముఖులు, ప్రజలు గురువారం జిల్లా అధికారులకు  వినతిపత్రాలు సమర్పించారు. గ్రామానికి చెందిన 62 మంది లబ్ధిదారులకు సర్వే నంబర్-8లో ఇళ్ల స్థలాల పట్టాలు మంజూరైనప్పటికీ, అధికారులు ఇప్పటివరకు వారికి స్థలాల పొజిషన్ చూపించలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై జిల్లా అదనపు కలెక్టర్ సంగీతకు వినతిపత్రం అందజేశారు. సదరు స్థలం అటవీ భూమి అని చెబుతూ అధికారులు కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే రెవెన్యూ, అటవీ శాఖల ఆధ్వర్యంలో సంయుక్త సర్వే నిర్వహించాలని కోరుతూ జిల్లా అటవీ శాఖ అధికారికి కూడా ప్రత్యేక వినతిపత్రం అందజేశారు. గ్రామంలోని సర్వే నంబర్-34లో పర్యావరణ పరిరక్షణ కోసం కేటాయించిన పల్లె ప్రకృతి వనం భూములను కొందరు వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ భూములను రక్షించి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గ్రామంలో మొబైల్ నెట్‌వర్క్ సమస్య తీవ్రంగా ఉందని, అత్యవసర సమయాల్లో కూడా ఫోన్ సిగ్నల్ అందడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనివల్ల విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. గ్రామంలో వెంటనే బీఎస్‌ఎన్‌ఎల్ సెల్ టవర్ ఏర్పాటు చేయాలని టెలికాం శాఖ అధికారులను కోరారు. ఎన్నో ఏళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ సమస్యలు పరిష్కారం కావడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ తలారి దయానంద్, మాజీ వార్డు సభ్యుడు యాట నాగరాజు,మద్దూరి లక్ష్మణ్ తదితర గ్రామ ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు

🕒 05 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-problems-of-mambapur-village-should-be-solved/article-16227

Tags: