రైతు సమస్యల పై ఐక్య పోరాటానికి పిలుపు
విశ్వంభర, బాగ్ లింగంపల్లి: మద్దతు ధరలను పెంచకపోవడం, వ్యవసాయ రంగానికి తగిన ప్రణాళిక లేకపోవడం వల్ల రైతులు తీవ్ర సంక్షోభంలో ఉన్నారని, ఈ విధానాలపై రైతులు ఐక్యంగా పోరాడాలని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర వైజ్ఞానిక శిక్షణా తరగతులను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం పెరిగిన పెట్టుబడులకు అనుగుణంగా మద్దతు ధరలు పెంచకపోవడం, రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ ప్రణాళికను సమర్థంగా అమలు చేయకపోవడం వల్ల ఉత్పత్తి రంగం సంక్షోభంలోకి వెళ్లిందని ఆయన విమర్శించారు. హార్టికల్చర్ విస్తీర్ణాన్ని పెంచాల్సిన అవసరం ఉన్నప్పటికీ నిధుల కేటాయింపులు తగిన స్థాయిలో లేవని తెలిపారు. రైతు భరోసా నిధులను వెంటనే విడుదల చేయాలని, నకిలీ విత్తనాలు–ఎరువులను అరికట్టి నాణ్యమైన సరఫరా చేయాలని కోరారు. కౌలు రైతులకు రుణార్హత కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్, సారంపల్లి మల్లారెడ్డి, పి జంగారెడ్డి, అరిబండి ప్రసాద్ రావు, మూడ్ శోభన్, లెల్లెల బాలకృష్ణ, ఉడుత రవీందర్, శెట్టి వెంకన్న, దుబ్బాక రామ్ చందర్, వెంకటేష్, కొంగరి వెంకట్ మావో, రమేష్ గౌడ్, సి హెచ్ రాము, జనార్దన్ రెడ్డి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.