ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
విశ్వాంభర, సదాశివపేట : సదాశివపేట మండలం పెద్దాపూర్ గ్రామంలో, పటాన్చెరు పరిధిలో మోటార్ సైకిల్ దొంగతనాలు చేసినటువంటి వ్యక్తిని సదాశివపేట పోలీసులు పట్టుకొని అతడి నుంచి రెండు ద్విచక్రవాహనలను స్వాధీనం చేసుకున్నారు. సదాశివపేట పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటేష్ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. నేరస్తుడు కొండాపూర్ మండలం తోగోర్పల్లి చెందిన పిచ్చకుంట్ల సురేష్ అను అతను జల్సాలకు, మద్యానికి అలవాటు పడి, బలాదూర్ గా తిరుగుతూ సులభంగా డబ్బులు సంపాదించాలని నిర్ణయించుకొని ఇదే నెలలో మొదటగా పెద్దాపూర్ లో రాత్రి పూట భారత్ పెట్రోల్ పంప్ వద్ద పార్క్ చేసిన ప్యాషన్ ప్లస్ బైక్, పటాన్ చెరు లో రుద్రవరం దెగ్గర గ్లామర్ బైక్ ని దొంగతనం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అతని వద్ద నుండి రెండు బైకులను స్వాధీనం చేసుకొని నేరస్తుడిని రిమాండ్ కు తరలించినట్లు సదాశివపేట ఇన్స్పెక్టర్ డి.వెంకటేష్ గారు తెలిపినారు. దొంగను పట్టుకున్న క్రైమ్ టీమ్ వెంకటేశం, అమానుల్లా, నహీద్ పాషలను ఇన్స్పెక్టర్ గారు అభినందించారు.