బండి సంజయ్ రాజీనామా చేయాలి.
- -ఏఐఎస్ఎఫ్
విశ్వంభర, కరీంనగర్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రాజీనామా చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి డిమాండ్ చేశారు. 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక దాడి ఘటనలో వెంటనే పోక్సో కేసు నమోదు చేసి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కరీంనగర్ తెలంగాణ చౌక్ వద్ద సోమవారం నిర్వహించిన నిరసనలో మాట్లాడుతూ, బాధితులు ఈ నెల 8న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినప్పటికీ కేసు నమోదు కాలేదని ఆరోపించారు. బాధిత కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేస్తూ కేసును నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. బాధ్యత వహిస్తూ బండి సంజయ్ పదవికి రాజీనామా చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్ ద్వారా వేగవంతమైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మచ్చ రమేష్, మామిడిపల్లి హేమంత్, నూనావత్ శ్రీనివాస్ నాయక్, సందీప్ రెడ్డి, సాయి కృష్ణ, అజయ్, రాకేష్, అరుణ్, వినయ్, ఈశ్వర్, రిషి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.