కేంద్రమంత్రి పదవి నుండి బండి సంజయ్ ను బర్త్ రఫ్ చేయాలి
- బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వోడితల సతీష్ కుమార్
విశ్వాంభర, హుస్నాబాద్: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ మైనర్ బాలికకు న్యాయం జరగాలని నిరసన తెలిపారు. ప్రధానమంత్రి మోడీ "బేటీ బచావో.. బేటీ పడావో" అంటున్నారని, ఆది కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదన్నారు. బహుశా భారతదేశంలో మొట్ట మొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కేంద్ర మంత్రిని ఇవాళ కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేదన్నారు. తప్పు చేసిన కొడుకుని దాచిపెట్టిన ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగడం తెలంగాణకే కాదు, భారతదేశానికి కూడా అవమానకరమన్నారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి ఇద్దరూ కుమ్మక్కై ఆ అమ్మాయికి అన్యాయం చేయాలనుకున్నా, ఆ తల్లిదండ్రి వెనకడుగు వేయలేదన్నారు. బిఆర్ఎస్ పోరాటం వలన మొత్తానికి ఇవాళ ఆ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.