జయశంకర్ ఆశయాలు సాధనలోనే నిజమైన నివాళి
విశ్వంభర, అంబర్‌పేట : ప్రత్యేక తెలంగాణ సాధన కోసం జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్ ఆశయాలను కొనసాగించడం ప్రతి ఒక్కరి బాధ్యతని తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ అంబర్‌పేట్ నియోజకవర్గ కన్వీనర్ జి. రూబీ స్టీవెన్ సన్ పేర్కొన్నారు. హైదరాబాదు అంబర్‌పేటలో ప్రొఫెసర్ జయశంకర్ 15వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1969 తెలంగాణ ఉద్యమంతో పాటు అంతకుముందు నాన్ ముల్కీ ఉద్యమం, సాంబార్-ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమాల్లో జయశంకర్ చురుకుగా పాల్గొన్నట్లు వివరించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర అవసరాన్ని వివరిస్తూ పలు పుస్తకాలు రచించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని కళ్లారా చూడాలని ఆశించిన జయశంకర్, రాష్ట్ర ఏర్పాటు కంటే ముందే 2011 జూన్ 21న మరణించడం బాధాకరమని అన్నారు. ఆయన జ్ఞాపకార్థం జయశంకర్ జిల్లాను ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో: ఉప్పు సుధాకర్, శశిధర్ శిల్పి, అశోక్, దయాకర్ యాదవ్, వర్కలా శ్రీకాంత, బి. జాన్, భాను దాస్, అమర్నాథ్, శివ, బి. రవీందర్, ఎం.డి. అలీం పాల్గొన్నారు.