మృతుడి కుటుంబానికి పూర్వ విద్యార్థుల ఆర్ధిక సహాయం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం  వెల్లంకి గ్రామం లో జినుక అనిత భర్త శ్రవణ్ ఇటీవలే అనారోగ్యంతో మరణించారు. ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి ఆమె స్నేహితులైన పదవ తరగతి 2012-13 బ్యాచ్ కలిసి రూ.26,000 ఆర్థిక సాయం అందజేసింది. భవిష్యత్తులో అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. స్నేహమంటే కేవలం కలిసి చదువుకోవడమే కాదు, ఆపత్కాలంలో ఆపన్న హస్తం అందించడమని చాటిచెప్పారు. ధైర్యంగా ఉండాలని మిత్రులందరి తరఫున వెన్ను తట్టారు. కాగా వారిని గ్రామస్థులు, పలువురు అభినందించారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/alumni-financial-assistance-to-the-family-of-the-deceased/article-16887

Tags: