ఘనంగా "మాకూచరిత్ర ఉంది"పుస్తకా విష్కరణ
- గ్రామచరిత్రకు అక్షర రూపం అభినందనీయం..
- తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొ.వెంకటనారాయణ
విశ్వంభర, నెల్లికుదురు: హిస్టారికల్ గ్రామం మేచరాజుపల్లి గ్రామ చరిత్రకు అక్షర రూపం ఇచ్చి మాకూచరిత్ర ఉంది అనే పుస్తకాన్ని అక్షర ప్రియులతో పాటు అన్ని వర్గాల ప్రజలకు అందించడం అభినందనీయమని తెలుగు అకాడమీ చైర్మన్ ప్రొఫెసర్ కూరపాటి వెంకటనారాయణ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని మేచరాజు పల్లి గ్రామానికి చెందిన దివంగత ఎల్తూరి ముత్తయ్య సంస్మరణ సభ ముత్తయ్య కుమారుడు పెద్దపల్లి సిపిఎం కార్యదర్శి,కవి,రచయిత ఎల్తూరి యాకయ్య ఆధ్వర్యంలో మేచరాజుపల్లి గ్రామంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు.దీనికి ముఖ్య అతిథులుగా తెలుగు అకాడమీ చైర్మన్ రిటైర్డ్ ప్రొ.డా.కూరపాటి వెంకటనారాయణ, స్థానిక సర్పంచి తూర్పాటి శంకరయ్య, మహబూబాబాద్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ సూర్ణం సోమయ్య, ప్రజాకవిజయరాజు, సిపిఎం నేతలు కా.ఎస్ వీరయ్య కా.జి రాములు,బొజ్జ బిక్షమయ్య, సర్పంచులు బాధావతు సుధారాణి సురేష్,ఇసంపెల్లి కవిత, ధర్మారపు మహేందర్ ప్రభృతులు హాజరై ముందుగా ముత్తయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు.బంధు సాయిలు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎల్తూరి యాకయ్య రాసిన మాకూ చరిత్ర ఉంది పుస్తకాన్ని స్వర్గీయ ముత్తయ్య సతీమణి ఐలమ్మ తో కలిసి ఆవిష్కరించారు. అనంతరం ప్రొ. వెంకటనారాయణ మాట్లాడుతూ సంబంధిత పుస్తకంలో రచయిత యాకయ్య చిన్ననాటి తీపిగురుతులతో పాటు విప్లవ వీరుల సాహసోపేతమైన గాధలను కళ్ళకు కట్టినట్లు చూపించడం భవిష్యత్ తరాలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ప్రజాకవి,గాయకులు జయరాజు మాట్లాడుతూ మారుమూల గ్రామమైన మేచరాజుపల్లి గ్రామంలో విద్యాభ్యాసం చేసి గ్రామ చరిత్రను పుస్తక రూపంలో అందించడంతోపాటు తన తండ్రి ఎల్తూరి ముత్తయ్య, తన కుటుంబ చరిత్ర, సాయుధ పోరాటంలో అసువులు బాసిన గ్రామ వీరుల పోరాట పటిమ వివరించడం గొప్ప విషయం అన్నారు. ప్రజానాట్యమండలి కళాకారులచే వీర తెలంగాణ నాటకం తో పాటు కళాకారుల ఆటపాట సబికులను అలరించింది.కార్యక్రమంలో రిటైర్డ్ డిఎస్పి బంటు రాములు, సిపిఎం కేంద్ర,రాష్ట్ర కమిటీ సభ్యులు వీరయ్య,బందు సాయిలు, జర్నలిస్ట్ గొడుగు శీను, ఎర్రబెల్లి నవీన్ రావు,కోటగిరి కృష్ణ,ముంజంపల్లి వీరన్న,కూరపాటి వెంకటేశ్వర్లు,కోటగిరి రమేష్ లతో పాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు పరిసర గ్రామాల ప్రజలు హాజరయ్యారు.