సిద్దిపేట రూరల్ ఎస్ఐగా నవత
విశ్వంభర, సిద్దిపేట: సిద్దిపేట రూరల్ పోలీస్‌స్టేషన్ నూతన ఎస్ఐగా డి.నవత ఆదివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. 2018బ్యాచ్‌కు చెందిన నవత ఇంతకముందు సిద్దిపేట వన్ టౌన్ ఎస్ఐగా, కమిషనరేట్‌లోని సీసీఆర్బీలో పనిచేశారు. సీసీఆర్బీ నుంచి రూరల్‌కు బదిలీపై వచ్చారు. ప్రస్తుతం ఎస్ఐగా విధులు నిర్వహించిన రాజేశ్ కమిషనరేట్‌లోని పోలీస్ కంట్రోల్ రూమ్‌కు బదిలీ అయ్యారు. స్టేషన్ సిబ్బంది నూతన ఎస్ఐ నవతకు స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు. రాజేశ్‌కు ఘనంగా వీడ్కొలు పలికారు. కాగా ఈ ఇద్దరు ఎస్ఐలు విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరిస్తారనే పేరుంది. ఈ సందర్భంగా నవత మాట్లాడుతూ స్టేషన్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు కృషిచేస్తానని చెప్పారు. రూరల్ ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.