వడ్ల కొనుగోలుపై కేంద్రం సమాధానం చెప్పాలి

  • ప్రభుత్వ విప్ నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం

విశ్వంభర, రామన్నపేట: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడిగిన వడ్ల కొనుగోలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఏదేదో మాట్లాడుతున్నారనీ, ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం విమర్శించారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో సేకరించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కేంద్రం కొనుగోలు చేస్తోందని, కానీ తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా రైతులను మోసం చేస్తున్న పార్టీ బిజెపి అని ఈ విషయాన్నీ దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ఇక్కడి బీజేపీ నాయకులు రాజకీయ విమర్శలు తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎలాంటి స్పష్టమైన హామీ కేంద్రం నుండి తీసుకురాలేక పోయారని ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు అండగా నిలుస్తూ, రాష్ట్రంలో పండిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. జూన్ 17వ తేదీ లోపు రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన ప్రతి గింజను కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం కూడా స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. రైతులు కష్టపడి పెద్ద ఎత్తున ధాన్యం ఉత్పత్తి చేసి రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో ముందంజలో నిలిపారని పేర్కొన్నారు.

🕒 10 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-center-should-give-an-answer-on-the-purchase-of/article-16352

Tags: