రామన్నపేటలో సిమెంట్ కంపెనీ స్థాపన నిర్ణయం వెనక్కి తీసుకున్న అదాని గ్రూప్ 

విశ్వంభర, రామన్నపేట:  యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల పరిధిలోని రామన్నపేట, కొమ్మాయి గూడెం గ్రామాల పరిధిలో గతంలో అదాని కంపెనీ సిమెంట్ కర్మాగారం స్థాపన నిర్ణయం ప్రకటించి భూముల కొనుగోలు కూడా జరిపింది. కానీ మండల ప్రజల తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా, అఖిల పక్ష పోరాటం ఫలితంగా, పర్యావరణ కారణాల రిత్యా అదాని సంస్థ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ఆ స్థలంలో లాజిస్టిక్ పార్కు ఏర్పాటు నిర్ణయాన్ని ప్రకటించింది. శనివారం రోజు అదాని కంపెనీ అధికార ప్రతినిధులు యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే  వేముల వీరేశం అధ్యక్షతన అదాని కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్, జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ లాజిస్టిక్స్ పార్క్ వైస్-ప్రెసిడెంట్ మాట్లాడుతూ, రామన్నపేట మండల కేంద్రంలో లాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. లాజిస్టిక్ కంపెనీ గురించి సవివరంగా వివరించారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/adani-group-withdraws-decision-to-set-up-cement-company-in/article-16907

Tags: