కోర్టు ఆవరణలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
విశ్వంభర, హుస్నాబాద్: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్ కోర్టు ఆవరణలో యోగా శిక్షకులు ,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సాయిని మల్లేశం ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోర్టు జడ్జిలు, బార్ అసోసియేషన్ సభ్యులు, కోర్టు సిబ్బంది పాల్గొని యోగాసనాలు, ధ్యానం సాధన చేసి యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా జూనియర్ సివిల్ జడ్జి బి. రేవతి మాట్లాడుతూ యోగా జీవనశైలి వ్యాధులను నివారించడంలో ఖర్చులేని ఔషధంలా పనిచేస్తుందని అన్నారు. యోగా సాధన వల్ల మానసిక ప్రశాంతత, స్థిరత్వం, ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయని తెలిపారు. ప్రతిరోజూ యోగా చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, అలాగే యోగా వసుధైక కుటుంబక భావనను బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. 177 దేశాల మద్దతుతో యునైటెడ్ నేషనల్ తీర్మానం ఆమోదం పొంది చరిత్రలోనే ఒక తీర్మానానికి అత్యధిక దేశాల మద్దతు పొంది 2015 జూన్ 21న మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవం గా జరుపుకున్నారు. అన్ని వయస్సుల వారిని ఒకే వేదికపైకి తీసుకువస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు జూనియర్ సివిల్ జడ్జి ప్రమిద, బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఒగ్గోజు సదానందం, న్యాయవాదులు చిత్తారి రవీందర్, సుంకే రాజశేఖర్, కన్నోజు రామకృష్ణ, సబ్బని శ్రీదేవి, రాజ్యలక్ష్మి, మురళీమోహన్, రవీందర్,కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.