మందకృష్ణ మాదిగ కాలనీ బోర్డు తొలగింపుపై చర్యలు తీసుకోవాలి: ఎంఆర్పీఎస్ నేత దాస్

విశ్వంభర, అనంతపురం రూరల్:అనంతపురం రూరల్ మండలంలోని సజ్జల కాలవ గ్రామం వద్ద సెవెన్ హిల్స్ వెంచర్ సమీపంలో ఏర్పాటు చేసిన పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కాలనీ బోర్డును తొలగించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంఆర్పీఎస్ నాయకుడు దాస్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సుమారు 16 సంవత్సరాల క్రితం జిల్లా కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వోల ఆదేశాల మేరకు సర్వే నంబర్ 41/1లో మాదిగల కోసం ఇంటి పట్టాలు మంజూరు చేశారని తెలిపారు. ఆ భూమిలో ఏర్పాటు చేసిన కాలనీకి "పద్మశ్రీ మందకృష్ణ మాదిగ కాలనీ"గా పేరు పెట్టి బోర్డు ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. అయితే నాలుగు రోజుల క్రితం కొందరు వ్యక్తులు అక్రమంగా కాలనీ బోర్డును తొలగించారని ఆరోపించారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, బోర్డును యథాస్థానంలో తిరిగి ఏర్పాటు చేయడంతో పాటు బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో "చలో అనంతపూర్"తో పాటు మరో "పులికేక" కార్యక్రమానికి పిలుపునిస్తామని దాస్ హెచ్చరించారు. ఈ విషయంపై జిల్లా యంత్రాంగం తక్షణమే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఎంఆర్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/draft-add-your-title/article-16949

Tags: