పూర్తిస్థాయిలో రైతు భరోసా ఇవ్వాలి
- పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలి
- ముదిరాజ్ మహాసభ హుస్నాబాద్ మండల అధ్యక్షులు పొన్నబోయిన శ్రీనివాస్
విశ్వంభర, హుస్నాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న బకాయిలన్నింటినీ వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ హుస్నాబాద్ మండల అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పొన్నబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుబంధు పథకానికి రైతు భరోసా అని పేరు మార్చి, గత ప్రభుత్వం కంటే ఎక్కువ సాయం అందిస్తామని హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. అయితే, గతంలో కేసీఆర్ ప్రభుత్వం అందించిన స్థాయిలో కూడా రైతులకు ఆర్థిక సాయం అందడం లేదని విమర్శించారు. రైతు భరోసా పథకానికి కేటాయించిన నిధులు ఎక్కడికి వెళ్తున్నాయో ప్రభుత్వం ప్రజలకు వివరించాలని ఆయన కోరారు. రైతే రాజు, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వం ఎకరం, రెండు ఎకరాల పరిమితులతో రైతులకు సాయం అందించడం సరైన విధానం కాదన్నారు. రైతులు పండించిన ఆహారంతోనే సమాజం జీవిస్తుందని, అలాంటి రైతుల పట్ల వివక్ష చూపడం తగదన్నారు. ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ జీతాలను పూర్తిస్థాయిలో తీసుకుంటున్నప్పుడు రైతుల సాయంలో కోతలు ఎందుకు విధిస్తున్నారని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రైతుల పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించి, పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా బకాయిలను విడుదల చేయడంతో పాటు అర్హులైన ప్రతి రైతుకు పూర్తి స్థాయిలో ఆర్థిక సాయం అందించాలని పొన్నబోయిన శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.