మహిళల ఆర్థిక శక్తితోనే దేశ ప్రగతి

మహిళల ఆర్థిక శక్తితోనే దేశ ప్రగతి

విశ్వంభర, కాచిగూడ : మహిళలు ఆర్థికంగా ఎదిగితేనే దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.హైదరాబాదు గోల్నాక డివిజన్ నెహ్రూనగర్ వార్డు కార్యాలయంలో యూసీడీ అధ్యక్షురాలు జి.రజిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి పథకం చీరల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని మహిళలకు చీరలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళలు సంకల్పిస్తే ఏ లక్ష్యాన్నైనా సాధించగలరని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించాలని సూచించారు. మహిళలు అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా ఎదిగి తమ ప్రతిభను నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. మహిళల్లో కొనుగోలు శక్తి పెరిగినప్పుడే దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుందని తెలిపారు. నియోజక వర్గంలోని అన్ని కేంద్రాల్లో ఈ నెల 25వ తేదీ వరకు చీరల పంపిణీ కొనసాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో: ఇన్చార్జి ఆర్.చండీకేశ్వరం, గోల్నాక మాజీ డివిజన్ అధ్యక్షుడు భరత ముదిరాజ్, కాలేరు రామకృష్ణ, ఆర్కే బాబు, ఎ.సురేశ్ గౌడ్, కాలేరు రాజు, పి.సంతోష్, లక్ష్మీ ముదిరాజ్, స్వరూప, కల్పన, సుమతి, అంబటి రవి, బాలరాజు, ఆప్ప శ్రీను, యూసుఫ్ షరీఫ్, రాజేశ్ పాల్గొన్నారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-countrys-progress-depends-on-the-economic-power-of-women/article-16861

Tags: