పేదలకు ఇళ్ల కోసం వామపక్షాల కార్యాచరణ

పేదలకు ఇళ్ల కోసం వామపక్షాల కార్యాచరణ

విశ్వంభర, హైదరాబాదు : ప్రతి నిరుపేదకు ఇల్లు సాధించడమే లక్ష్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు, గృహాలు కల్పించేందుకు వామపక్ష పార్టీలు ఉద్యమానికి సిద్ధమయ్యారన్నారు. హైదరాబాదు హిమాయత్ నగర్ లోని మఖ్ధూంభవన్‌లో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఉద్యమ కార్యాచరణను వెల్లడించారు. ఈ నెల 27న హనుమకొండలో భారీ ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలిపారు. గుండ్ల సింగారం, గోపాల్‌పూర్ ప్రాంతాల్లో కూల్చిన గుడిసెల స్థానాల్లో ఇళ్లు నిర్మించాలని డిమాండ్ చేశారు. జూలై 1న రాష్ట్రంలోని జిల్లా కేంద్రాలు, కలెక్టర్ కార్యాలయాల ఎదుట ముట్టడులు చేపట్టనున్నట్లు చెప్పారు. జూలై 6న హైదరాబాదు ఇందిరాపార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించి, పేదల దరఖాస్తులను ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. ‘గుడిసెల పోరాటం’ పేరుపై జూలై 2న నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. గుడిసెల కూల్చివేతలపై ఆందోళన వ్యక్తం చేస్తూ పేదలకు ఇళ్ల స్థలాలు, గృహాలు కేటాయించాలని డిమాండ్ చేశారు. సిపిఐ(ఎం) నేత అబ్బాస్ పేదలపై కేసులను ఖండించారు. గోవర్ధన్ బుల్డోజర్ చర్యలను ఆపాలని కోరారు. సుధాకర్ భూముల కబ్జాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. భరత్ అధికారుల వ్యవహారంపై విచారణ కోరారు. ఈ కార్యక్రమంలో తక్కెళ్లపల్లి శ్రీనివాసరావు, ఈ.టి.నరసింహా, పశ్యపద్మ, నెల్లికంటి సత్యం, బి.స్టాలిన్, బాషామియా, కర్రె భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/left-wing-activism-for-housing-for-the-poor/article-16869

Tags: