ఉమ్మాపూర్ గ్రామంలో వర్షాల కోసం గ్రామ దేవతలకు జలాభిషేకం
విశ్వంభర, హుస్నాబాద్: వర్షాలు కురవాలంటూ, పంటలు బాగా పండాలంటూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్ గ్రామస్తులఆధ్వర్యంలో గ్రామదేవతలకు జలాభిషేకాలు చేశారు. ఈ సందర్బంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఎండలు బాగా పెరిగిపోయి వర్షాల జాడ కరువైందంటూ రోజురోజుకు ఎండ విపరీతంగా పెరిగిపోతుండడంతో వర్షాలు పడే సమయం అయినా వర్షాల జాడ లేదని ఆవేదనతో ఉమ్మాపూర్ గ్రామస్తులు గ్రామ దేవతలకు, వనదేవతలకు, హనుమంతుడికి, భైరవాది గుట్టలో ఉన్న కాలభైరవుడికి జలాభిషేకం నిర్వహించారు. బండపై వరద పాశం పోసి నాలుకతో అద్దారూ అలాగే బతకమ్మ ఆటలు వాడారు. ఇకనైనా దేవుని దయతో సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు, పశుపక్షాదులు, చల్లంగా ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ చొప్పరి ప్రశాంత్, పాలకవర్గం, మాజీ సర్పంచ్, మాజీ వార్డ్ మెంబర్స్, యువతీ యువకులు, చిన్నారులు, గ్రామస్తులు తదితరులు ఎండను సైతం లెక్కచేయకుండా కాలినడకన ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.