భద్రాచలంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగే మార్గం: ఐటీడీఏ పీవో రాహుల్

విశ్వంభర, భద్రాచలం: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని ట్రైబల్ మ్యూజియంలో ఆదివారం ఘనంగా యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ మాట్లాడుతూ యోగ భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక అని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగ ఎంతో అవసరమని అన్నారు. యోగా గురువు గుమలాపురం సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, గిరిజన సంక్షేమ శాఖ ఆశ్రమ పాఠశాలల విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది, వివిధ శాఖల అధికారులు పాల్గొని యోగాసనాలు, ప్రాణాయామం సాధించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ యోగ ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు ఒత్తిడి, ఆందోళనలను అధిగమించవచ్చని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజూ యోగ సాధన చేయడం ద్వారా ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంపొందించుకోవచ్చన్నారు. అనంతరం యోగా గురువు సత్యనారాయణ వివిధ యోగాసనాలు, ప్రాణాయామ విధానాలను ప్రదర్శించి వాటి ప్రయోజనాలను వివరించారు. కార్యక్రమం ముగింపులో ఐటీడీఏ పీవో బి. రాహుల్ యోగా గురువును శాలువా, జ్ఞాపికతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, ఈఈ మధుకర్, డీడీ చందన, ఎస్‌డీసీ ఆనంద్ కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీధర్ తదితర అధికారులు, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. "యోగను అలవాటు చేసుకుందాం – ఆరోగ్యవంతమైన భవిష్యత్తును నిర్మించుకుందాం" అనే సందేశంతో కార్యక్రమం ముగిసింది.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/international-yoga-day-in-bhadrachalam/article-16932

Tags: