సరస్వతి శిశు మందిర్‌లో ఘనంగా యోగా దినోత్సవం

విశ్వంభర, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని సరస్వతి శిశు మందిర్‌లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యోగాసనాలు, ప్రాణాయామం, సూర్యనమస్కారాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ 17వ వార్డు కౌన్సిలర్ గాదపాక రవీందర్ దీపప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు యోగాసనాలు, ప్రాణాయామం, సూర్యనమస్కారాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో శిశు మందిర్ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కొత్తపల్లి అశోక్, సమితి సభ్యులు పోతుగంటి వెంకటరెడ్డి, ప్రధానాచార్య పాలారం శ్రీలత, ఆచార్య శ్రీరామ్‌తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. యోగా ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-grand-yoga-day-at-saraswati-shishu-mandir/article-16897

Tags: