జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

  • జూలై 10లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి

విశ్వంభర, భద్రాచలం: విద్యా రంగంలో విశిష్ట సేవలు అందిస్తున్న ఉపాధ్యాయులను గుర్తించి గౌరవించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రదానం చేసే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం 2026 సంవత్సరానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు ఈ అవార్డులకు అర్హులని పేర్కొన్నారు. విద్యార్థుల అభ్యాస ప్రమాణాల మెరుగుదల, వినూత్న బోధనా విధానాలు, పాఠశాల అభివృద్ధి, సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాల్లో చేసిన సేవలను ఎంపికలో పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. ఆసక్తి గల ఉపాధ్యాయులు జూలై 10లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ అయిన https://nationalawardstoteachers.education.gov.in లో నమోదు చేసుకుని సేవా వివరాలు, విజయాలు, ప్రశంసాపత్రాలు తదితర సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. జాతీయ స్థాయిలో ఉపాధ్యాయుల సేవలకు గుర్తింపు తెచ్చిపెట్టే ఈ అవార్డులకు అర్హులైన ఉపాధ్యాయులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యాశాఖ కోరింది.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/invitation-of-applications-for-national-best-teacher-awards/article-16922

Tags: