దేశవ్యాప్తంగా 'నీట్' గా పరీక్ష
విశ్వంభర, హైదరాబాదు : నీట్ పరీక్ష ఆదివారం దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలు సహా 551 నగరాల్లోని 5440 పరీక్షా కేంద్రాల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరుకోవడంతో రద్దీ కనిపించింది. హాల్ టికెట్లు, గుర్తింపు పత్రాలు తనిఖీ చేసిన తర్వాత అభ్యర్థులను లోపలికి అనుమతించారు. పరీక్ష నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు, ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేయడంతో పాటు సీసీ కెమెరాలు, నిఘా పర్యవేక్షణలో పరీక్షను నిర్వహించారు.