తెలంగాణ సాధనలో జయశంకర్ కృషి మరువలేనిది: గోపందాస్ కృష్ణ
విశ్వంభర, ఇనుగుర్తి: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి బలమైన సిద్ధాంత పునాది వేసి, ప్రత్యేక తెలంగాణ సాధన కోసం జీవితాంతం పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్ సార్ కృషి మరువలేనిదని అంబేద్కర్ యువజన సంఘం ఇనుగుర్తి పట్టణ అధ్యక్షుడు గోపందాస్ కృష్ణ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో గోపందాస్ కృష్ణ మాట్లాడుతూ తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేయడంలో జయశంకర్ సార్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. జయశంకర్ సార్ సూచించిన సిద్ధాంతాలను యువతతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆచరణలో పెట్టాలని, ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజ హితం కోసం ఆయన చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలకు సేవ చేయడమే జయశంకర్ సార్‌కు నిజమైన నివాళి అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు గుజ్జునూరి శ్రీకాంత్, వేముల శ్రీనివాస్, సంఘం ప్రతినిధులు బేతమల్ల మనోజ్, పింగిలి శ్రీనివాస్, నాయకులు గుజ్జనూరి బాబురావు, బేతమల్ల చంద్రయ్య, పప్పుల వెంకన్న , బొబ్బిలి మహేందర్ రెడ్డి, మామిడి శోభన్, దుంపల సందీప్, డా. వెంకటేశ్వర్లు, పప్పుల వెంకన్న , గుజ్జనూరి లక్ష్మయ్య, మంకాళి సలీం, చీదురు రాము, గాడ్దుల లింగన్న తదితరులు పాల్గొన్నారు.