కల్వల మోడల్ స్కూల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
విశ్వంభర, కేసముద్రం: కేసముద్రం మండలం కల్వల మోడల్ స్కూల్, కళాశాలలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ పరిమి నవీన్ మాట్లాడుతూ, భారతదేశం ప్రపంచానికి అందించిన అమూల్యమైన కానుక యోగా అని అన్నారు. ప్రస్తుత జీవనశైలిలో పెరుగుతున్న ఆరోగ్య సమస్యలకు యోగా సమర్థవంతమైన పరిష్కారమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ రోజూ కనీసం అరగంట సమయాన్ని యోగాసనాలు, ప్రాణాయామానికి కేటాయించాలని సూచించారు. యువత శారీరక, మానసిక వికాసానికి యోగా ఎంతో దోహదపడుతుందని, విద్యార్థుల్లో ఏకాగ్రత పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. యోగాను ఒక రోజు కార్యక్రమంగా కాకుండా నిత్యజీవితంలో భాగంగా చేసుకోవాలని పిలుపునిచ్చారు. యోగా కార్యక్రమాన్ని ఫిజికల్ డైరెక్టర్ లలిత ఆధ్వర్యంలో నిర్వహించగా, ఏర్పాట్లను ప్రిన్సిపాల్ అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్వేత, శ్రీదేవి, రమ్య, నరసయ్య, సోమయ్య, యాకయ్య, పార్థసారధి, విజయకుమారి తదితరులు, పాఠశాల, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.