23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఎబీవీపీ పిలుపు
విశ్వంభర, హుస్నాబాద్: అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ హుస్నాబాద్ నగర కార్యదర్శి బత్తుల రాజు మాట్లాడుతూ, ఇంటిగ్రేటెడ్ పాఠశాలల పేరుతో ప్రభుత్వ పాఠశాలలను ఎత్తివేసే ప్రయత్నాలను నిరసిస్తూ ఈ నెల 23న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల బంద్‌కు ఏబీవీపీ పిలుపునిచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని సుమారు 27 వేల ప్రభుత్వ పాఠశాలల్లో 23 వేల పాఠశాలలను మూసివేసి, మూడు లేదా నాలుగు మండలాలకు ఒకే పాఠశాలను ఏర్పాటు చేయాలనే ప్రభుత్వ ఆలోచన గ్రామీణ ప్రాంత విద్యార్థుల విద్యా హక్కులను కాలరాస్తోందని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రి చేసిన ఈ ప్రకటనను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో జరుగుతున్న విచ్చలవిడి ఫీజుల దోపిడీని అరికట్టేందుకు ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, విద్యాహక్కు చట్టం ప్రకారం పేద విద్యార్థులకు 25 శాతం సీట్ల కేటాయింపును పకడ్బందీగా అమలు చేయాలని కోరారు.ఖాళీగా ఉన్న ఎంఈఓ ,డిఈఓ పోస్టులతో పాటు టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని, గురుకుల పాఠశాలలకు పక్కా భవనాలు నిర్మించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్ చేశారు. అలాగే జాతీయ విద్యా విధానం అమలు చేయాలని, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు నిర్వహిస్తున్న పుస్తకాలు, యూనిఫార్ముల విక్రయాలను నిషేధించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌ఐడీ కన్వీనర్ చరణ్, మిషన్ సాహసి కన్వీనర్ అశ్విని, కో-కన్వీనర్ ప్రసన్న, శ్రావణ్, జస్వంత్, కార్తీక్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.