రైతుల భూముల స్వాధీనం దుర్మార్గం: ఆప్ విమర్శ

విశ్వంభర, హైదరాబాదు : అభివృద్ధి పేరుతో రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం దుర్మార్గమని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రతినిధి, తెలంగాణ ఇన్‌ఛార్జ్ ప్రియాంక కక్కర్ పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాదు బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల అన్యాయంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ పేరుతో రంగారెడ్డి జిల్లాలో రైతుల భూములను బలవంతంగా తీసుకోవడం తగదన్నారు. ప్రభుత్వం అభివృద్ధి పేరుతో ప్రకృతి, పర్యావరణాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోందని విమర్శించారు. ఇలాంటి చర్యల వల్ల భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుత ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో పాలన సాగిస్తోందని, ప్రజాస్వామ్య విలువలను పాటించడం లేదని వ్యాఖ్యానించారు. రైతుల భూములను రక్షించే వరకు, బాధితులకు న్యాయం జరిగే వరకు ఆమ్ ఆద్మీ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో: ఆప్ రాష్ట్ర కన్వీనర్ హేమా సుదర్శన్ జిల్లోజు, వర్కింగ్ ప్రెసిడెంట్ బుర్ర రాము గౌడ్, జనరల్ సెక్రటరీ డాక్టర్ అన్సారి, వైస్ జనరల్ సెక్రటరీ హైదర్, ఉప ట్రెజరర్ జవీద్ షరీఫ్ పాల్గొన్నారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/appropriation-of-farmers-land-is-evil-aap-criticism/article-16914

Tags: