హుస్నాబాద్ అంగడిలో అధిక వసూళ్లు  

హుస్నాబాద్ అంగడిలో అధిక వసూళ్లు  

  • సీపీఎం హుస్నాబాద్ నియోజకవర్గ నాయకుడు గుగులోతు శివరాజ్ 

విశ్వంభర, హుస్నాబాద్ : హుస్నాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన అంగడిలో నిర్ణయించిన ధరల కంటే ఇష్టరాజ్యంగా సదర్ కాంట్రాక్టర్ ఎక్కువగా వసూలు చేస్తున్నారని సీపీఎం హుస్నాబాద్ నియోజకవర్గ నాయకుడు గుగులోతు శివరాజ్ తెలిపారు. అంగడి కాంట్రాక్టర్ వేలంపాట ఎక్కువైందని అందుకోసమే ఎక్కువ వసూలు చేస్తున్నామని రైతులు వాపోతున్నట్లు తెలుస్తుంది. అదేవిధంగా అప్పుడే పుట్టిన గేదకు కూడా 500 రూపాయలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తుంది. నిబంధనల ప్రకారం ఆవులు బర్రెలకు మాత్రమే వసూలు చేయవలసి ఉండగా అధికారులు పర్యవేక్షణ లేకపోవడం వల్ల కొంతమంది అండదండలతో కాంట్రాక్టర్  ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నాడు. నిబంధనలు పట్టించుకోకుండా కాంట్రాక్టర్ ఇష్టానుసారంగా అధిక వసూలు చేస్తూన్నారు.అదేవిధంగా కూరగాయల అంగట్లో 50 రూపాయలకు బదులు 150 నుండి 500 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇటువంటి ఇష్టరాజ్య వసూళ్లపై మున్సిపల్ కమిషనర్ పట్టించుకోకపోవడం వల్ల రైతులు చిరు వ్యాపారస్తులు పెద్ద మొత్తంలో నష్టపోతున్నారు.  వసూలు చేసిన ప్రకారం రసీదు ఇవ్వకపోవడం ఏమిటి అని రైతులు, వ్యాపారస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంలో మున్సిపల్ కమిషనర్ చర్యలు తీసుకోవాలని గుగులోతు శివరాజ్ డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/high-collections-in-husnabad-angadi/article-16893

Tags: