ప్రొఫెసర్ జయశంకర్ కు ఘనంగా నివాళులు 

ప్రొఫెసర్ జయశంకర్ కు ఘనంగా నివాళులు 

 విశ్వంభర, మిర్యాలగూడ : తెలంగాణ సిద్ధాంతకర్త, ఉద్యమ ప్రేరణకర్త, మహనీయుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్  వర్ధంతి సందర్భంగా  మిర్యాలగూడ పట్టణంలోని జయశంకర్  విగ్రహానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి  పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన జీవితాంతం అంకితభావంతో కృషి చేసిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని అన్నారు.  తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పి, ఉద్యమానికి మేధోబలాన్ని అందించిన గొప్ప తాత్వికవేత్తగా ఆయన చరిత్రలోచిరస్థాయిగానిలిచిపోతారని పేర్కొన్నారు. తెలంగాణరాష్ట్రఆవిర్భావానికి జయశంకర్ సార్ చేసిన సేవలు అమూల్యమైనవని, ఆయన చూపిన మార్గంలో నడుస్తూ తెలంగాణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.  జయశంకర్ సార్ ఆశయాల సాధనే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీనాయకులు,ప్రజాప్రతినిధులు,కార్యకర్తలు,అభిమానులు మరియు పట్టణ ప్రముఖులుపాల్గొని జయశంకర్ సార్ కు  ఘనంగా  నివాళులర్పించారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/tributes-to-professor-jayashankar/article-16859

Tags: