స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలపై పోరాటం తప్పనిసరి
విశ్వంభర, బాగ్ లింగంపల్లి : దేశ వ్యవసాయాన్ని దెబ్బతీసే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఎదుర్కోవడం రైతు-కూలీల బాధ్యతని ప్రొఫెసర్ దొంతి నరసింహారెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాదు బాగ్ లింగంపల్లిలో జరిగిన రైతు కూలీ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సంఘం అధ్యక్షులు పట్టోళ్ల నాగిరెడ్డి, కార్యదర్శి వెల్తురు సదానందం అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో భవిష్యత్ పోరాట కార్యాచరణపై పలు తీర్మానాలు చేశారు. ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు రైతుల జీవితాలను సంక్షోభంలోకి నెట్టుతున్నాయని విమర్శించారు. విదేశీ కార్పొరేట్ వ్యవసాయ ఉత్పత్తులకు దేశాన్ని డంపింగ్ యార్డుగా మార్చే విధానాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యుద్ధాల ప్రభావంతో పెరుగుతున్న ఇంధన, ఎరువుల కొరత రైతాంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందని పేర్కొన్నారు. పట్టోళ్ల నాగిరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో ఐకేపీ కేంద్రాల్లో నిల్వ ఉన్న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రైతులకు పంట రుణాల మాఫీతో పాటు సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు తక్షణమే అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అరుణోదయ రాష్ట్ర చైర్మన్ విమలక్క మాట్లాడుతూ, వ్యవసాయాన్ని కూల్చివేసే విధానాలకు వ్యతిరేకంగా గ్రామస్థాయిలో పోరాటాలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. భూముల అక్రమ కబ్జాలు, చెరువుల ఆక్రమణలను అడ్డుకోవడంలో ప్రజల పాత్ర కీలకమని పేర్కొన్నారు. సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలకు పిలుపునిస్తూ జూన్ 16న ఐకేపీ కేంద్రాల వద్ద నిరసనలు, జూన్ 18న తహసీల్దార్ కార్యాలయాల ముట్టడులు, జూన్ 22న వ్యవసాయాన్ని నాశనం చేసే వెంచర్లకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమంలో అరుణోదయ రాష్ట్ర అధ్యక్షులు మల్సూర్, ప్రధాన కార్యదర్శి పోతుల రమేష్, అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ కార్యదర్శి బి భాస్కర్, సిపిఎంఎల్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రసాద్ అన్న, పిడిఎస్యు (విజృంభణ) రాష్ట్ర నాయకుడు ఏపూరి పవన్ , రాజేష్ తదితరులు పాల్గొన్నారు.