ఆర్టీసీ ని ప్రభుత్వంలో  వెంటనే విలీనం చేయాలి 

విశ్వంభర, హైదరాబాదు : ఎన్నికల హామీ మేరకు ఆర్టీసీని పూర్తిస్థాయిలో ప్రభుత్వంలో విలీనం చేయాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ చేశారు. హైదరాబాదు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం టీజీఎస్ ఆర్టీసీ బహుజన వర్కర్స్ యూనియన్ ఆవిర్భావ కార్యక్రమంలోఆయన  మాట్లాడారు. ఆర్టీసీని రక్షించేందుకు కార్మికులు ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీకి విలువైన ఆస్తులు ఉన్నాయని, వాటిలో కొంత భాగాన్ని వినియోగిస్తే సమస్యలు పరిష్కరించవచ్చని తెలిపారు. ప్రైవేటీకరణ ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. గతంలో ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిన సంస్థ, ప్రస్తుతం ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితి రావడం పాలన వైఫల్యమని అన్నారు. కార్మికుల సమస్యల పరిష్కారానికి చర్యలు అవసరమని, తమ పార్టీ తరపున సహాయం అందిస్తామని చెప్పారు. జూలై 5న భువనగిరిలో జరిగే రాజ్యాధికార సమరభేరిని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా బహుజన వర్కర్స్ యూనియన్ నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సంపత్ ముదిరాజ్  ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్  అధ్యక్షుడు సాజిద్,   వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ  కె వి చారి , కార్యదర్శులుగా రామచందర్  నాగేశ్వర్ , రమేష్, సురేష్ పాల్గొన్నారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/rtc-should-be-merged-with-govt-immediately/article-16875

Tags: