కాంగ్రెస్ నాయకుడు గుర్రం లక్ష్మారెడ్డి మృతి

  • అంతిమయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి

విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని రెడ్లరేపాక గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుర్రం లక్ష్మారెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. లక్ష్మారెడ్డి మృతి వార్త తెలుసుకున్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి రెడ్లరేపాక గ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం లక్ష్మారెడ్డి పార్థివ దేహంపై పూలమాల వేసి నివాళులర్పించి, ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేసి, ధైర్యంగా ఉండాలని సూచించారు. లక్ష్మారెడ్డి మృతి కాంగ్రెస్ పార్టీకి, గ్రామానికి తీరని లోటని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని లక్ష్మారెడ్డికి ఘనంగా వీడ్కోలు పలికారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/congress-leader-gurram-lakshmareddy-passed-away/article-16936

Tags: