హుస్నాబాద్ జడ్పీ బాలుర హైస్కూల్‌లో ఘనంగా యోగా దినోత్సవం

విశ్వంభర, హుస్నాబాద్: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని హుస్నాబాద్ జడ్పీ బాలుర హై స్కూల్ హెచ్ఎం కె. వాసుదేవ రెడ్డి ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు వివిధ యోగాసనాలను సాధన చేసి యోగా ప్రాముఖ్యతను చాటిచెప్పారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హెచ్‌ఎం కె. వాసుదేవ రెడ్డి మాట్లాడుతూ ప్రతిరోజు యోగా సాధన చేయడం ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని తెలిపారు. యోగాను నిత్య జీవితంలో భాగంగా చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమై, జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని చెప్పారు. విద్యార్థులు ఇంటి వద్ద, పాఠశాలలో ప్రతిరోజూ యోగాసనాలను దినచర్యగా అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిడి ఆర్. శ్రీనివాస్, ఉపాధ్యాయులు వీరారెడ్డి, రాజయ్య, రాజమల్లు, మార్కండేయ, వెంకటమల్లు, నర్సింహులు, బాలయ్య, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

🕒 22 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/a-grand-yoga-day-at-husnabad-zp-boys-high-school/article-16899

Tags: